దేవరలో మూడో పాత్ర ఏంటి స్వామి! | CineChitram

చానా పెద్ద కథ స్వామి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్స్ తో  దేవర ట్రైలర్ విడుదల అయిన దగ్గర నుంచి ‘దేవర కథ’ పై ఇప్పటికే ఎన్నో రుమార్లు షికార్లు చేశాయి. నిజానికి ట్రైలర్ చూస్తే.. కథ ఏదో కొంచెం బయటకు వచ్చినట్లుగా అనిపించింది. ట్రైలర్ ను బట్టి సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు, డబుల్ యాక్షన్ హైలైట్ గా ఉంటుందని అయితే ఓ క్లారిటీ వచ్చింది. మరోవైపు సముద్రానికి సంబంధించి ఆధిపత్యం మీద జరిగే పోరు, ఎన్టీఆర్ మొదటి పాత్ర ఆ ఆధిపత్యాన్ని ఫినిష్ చేసేసి, ఆ పోరులో తనకు త్యాగం చేస్తే.. రెండో ఎన్టీఆర్ పాత్రతో కథ మళ్లీ స్టార్ట్ అయింది ?, మొదటి పాత్ర టార్గెట్ ను రెండో పాత్ర ఎలా ఫినిష్ చేసింది అనేది మెయిన్ కథగా తెలుస్తుంది.

అయితే, ఇంతకీ, బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఏదో చెప్పబోతున్నారు అనే కోణాన్ని ట్రైలర్ లో సస్పెన్స్ గా పెట్టారు. కానీ అసలు ఇది కాదు, కథలో ఎన్టీఆర్ మూడో పాత్ర కూడా ఉంటుందని.. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుందని మరో కొత్త టాక్‌ నడుస్తుంది.
ఈ సినిమా కొరటాల శివకి – ఎన్టీఆర్ కి చాలా ప్రెస్టీజియస్. పైగా, కొరటాల శివ ‘ఆచార్య’ ప్లాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. అలాగే, ‘అరవింద సమేత’ వచ్చిన ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో మరిన్ని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

కాబట్టి, ట్రైలర్ లో విడుదల చేసిన కథా నేపథ్యం కంటే.. సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే దేవరలో ఎన్టీఆర్ మూడో పాత్ర పైనే ఇప్పుడు మరింత ఆసక్తి రేగుతుంది.

నిజంగానే దేవరలో మూడో పాత్ర ఉందా ?, ఆ పాత్ర పేరే దేవరా ?, ఆ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ నడుస్తోందా ? అనే విషయం చూడాలి. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

The post దేవరలో మూడో పాత్ర ఏంటి స్వామి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …