టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
కానీ, ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, ఆయన నెక్స్ట్ చిత్రాల లైనప్ చూస్తుంటే ఇప్పట్లో ‘దేవర-2’ ఉండదనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఈ కామెంట్స్ పై స్పందించాడు. ‘‘ ‘దేవర-2’ ఉండబోదని మాట్లాడుకునే వారికి చెబుతున్నా.. ‘దేవర-2’ ఖచ్చితంగా ఉంటుంది.. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చాం..’’ అంటూ తారక్ కుండ బద్దలు కొట్టాడు.
దీంతో ‘దేవర-2’పై ఏర్పడిన సందేహాలు అన్నీ కూడా తొలగినట్లు అయ్యింది. ఇక కొరటాల తెరకెక్కించిన ఈ రివెంజ్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
The post ‘దేవర-2’పై ఎన్టీఆర్ ఏమన్నాడంటే! first appeared on Andhrawatch.com.