దేవర 2 పై మరో కొత్త రూమార్‌! | CineChitram

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐతే, వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. దేవర పార్ట్ 2 లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి. అలాగే దేవర పార్ట్ 2లో దేవర కథ ఎక్కువుగా ఉండనున్నట్లు తెలుస్తుంది. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది.

The post దేవర 2 పై మరో కొత్త రూమార్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Hit 3 Teaser: Nani as Arjun Sarkaar Set to Arrive on This Date | CineChitram

The crime thriller franchise Hit has captivated audiences with its first two installments, and expectations …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading