ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను అరివళగన్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాకు సపోర్ట్ చేసేందుకు న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు. ‘శబ్దం’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నాని రానున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సిమ్రాన్, లైలా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
The post నాని వస్తున్నాడోచ్! first appeared on Andhrawatch.com.