నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా పూర్తి కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. వేసవి కానుకగా ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, నాని తన నెక్స్ట్ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనౌన్స్ చేశాడు.
కేవలం ఈ మూవీని అనౌన్స్ చేయడమే కాకుండా దీని రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2026 మార్చి 26న ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాల మధ్య దాదాపు ఏడాది వ్యవధి ఉంది. దీంతో ఈ మధ్యలో నాని తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.
హిట్-3 ముగియగానే, ప్యారడైజ్ షూటింగ్‌కు వెళ్లక ముందే.. మరో సినిమాను ప్లాన్ చేయాలని చూస్తున్నాడట నాని. అయితే, ఆ సినిమాను చాలా ఫాస్ట్‌గా తెరకెక్కించి రిలీజ్ కూడా చేయాలనేది ఆయన ప్లాన్ అని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే నాని ఈ రెండు సినిమాల మధ్యలో మరో సినిమాతో సర్‌ప్రైజ్ చేస్తాడా అనేది వేచి చూడాలి.
The post నాని సర్‌ప్రైజ్! first appeared on Andhrawatch.com.