పట్టుదలకి సెన్సార్ ముగిసింది! తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’ ఇప్పటికే కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అజిత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు.
ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తుండగా.. సీడెడ్ ప్రాంతంలో శ్రీలక్ష్మీ మూవీస్ విడుదల చేస్తుంది.
ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు ట్రీట్ అందించడం ఖాయమని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా ఉంది.ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
The post పట్టుదలకి సెన్సార్ ముగిసింది! first appeared on Andhrawatch.com.