ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సోమవారం. ఈ సందర్భంగా పవర్ స్టార్ కు సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజాగా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఓ మెసేజ్ పెట్టారు. ‘హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అని అల్లు అర్జున్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో అభిమానులు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ రేర్ ఫోటోని షేర్ చేస్తూ పవన్ కి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరో సోదరుడు నాగబాబు కూడా పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ‘ఈ పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే జెండా పట్టిన జనసైనికులకు, నమ్మి నడిచిన నాయకులకు, నువ్వు వస్తే మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతోమందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి.
ఉన్నత విలువలున్న ఓ గొప్ప వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది కాబట్టి మరింత ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని’ అంటూ నాగబాబు తన విషెస్ తెలియజేశారు.
The post పవన్ కి బన్నీ స్పెషల్ విషెస్! first appeared on Andhrawatch.com.