టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే బిజీగా ఉండగా ఈ తన సినిమాలు నెమ్మదిగా ఆలస్యం అవుతున్నాయి. అయితే ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్న పవన్ రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల మూలాన భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించి అందజేయడం కూడా జరిగింది.
అయితే రీసెంట్ గా కోలీవుడ్ నుంచి మొట్ట మొదటిగా 6 లక్షల విరాళాన్ని నటుడు శింబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు ఆడియెన్స్ శింబుని చూసి ఇతర తమిళ నటులు నేర్చుకోవాలని అన్నారు. మరి అయితే శింబు విరాళం ప్రకటించారో లేదో అనేది చాలా మందికి క్లారిటీ లేదు కానీ నిన్న పవన్ కళ్యాణ్ టీం నుంచి ధన్యవాదాలు పోస్టింగ్ తో శింబు కూడా ఇచ్చాడు అని కన్ఫర్మ్ అయ్యింది.
ఇక దీనిపై లేటెస్ట్ గా శింబు కూడా స్పందించి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేసాడు. తెలుగు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అంటూ తాజాగా శింబు రిప్లై ఇచ్చాడు. దీంతో తన రిప్లై పోస్ట్ లు వైరల్ గా మారాయి.
The post పవన్ కి శింబు స్పెషల్ థ్యాంక్స్! first appeared on Andhrawatch.com.