పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది కూడా చాలా మంది ఎదురు చూసారు.
ఆ మధ్య పవన్ పాడిన పాట వస్తుందని టాక్ వచ్చింది కానీ ఇంకా విడుదల కాలేదు. అయితే ఇపుడు ఫైనల్ గా ఈ పాట ఈ కొత్త ఏడాది ఆరంభం కానుంది అని తెలుస్తుంది. జనవరి 1 ప్రారంభానికి పవన్ పాడిన ఈ స్పెషల్ పాటని మేకర్స్ రాత్రి 12 గంటలకి విడుదల చేస్తున్నారంట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
The post పవన్ పాటతో కొత్త సంవత్సరానికి స్వాగతం! first appeared on Andhrawatch.com.