పవర్ఫుల్ టైటిల్ తో విజయ్ ఆంటోనీ 25వ సినిమా! మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయ్యి హీరోగా ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన మల్టీ టాలెంటెడ్ టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ ఆంటోనీ అని చెప్పొచ్చు. మన తెలుగు ఆడియెన్స్ కి “బిచ్చగాడు” మూవీతో సెన్సేషన్ గా మారిన తాను అక్కడ నుంచి దాదాపు అన్ని సినిమాలు తెలుగులో విడుదలకి తీసుకొస్తున్నాడు.
అయితే కొంచెం గ్యాప్ తర్వాత తన నుంచి వస్తున్నా తాజా మూవీ అందులోని తన కెరీర్ 25వ సినిమా తాలూకా టైటిల్ ని ఇపుడు ప్రకటించాడు.మరి ఆ సినిమానే “పరాశక్తి”. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాని ప్రకటించి తన నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల ఉంటుంది అన్నట్టుగా తెలిపాడు. అలాగే ఈ మూవీని డైరెక్టర్ అరుణ్ ప్రభు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో ఈ ఏడాది వేసవి కానుకగా విడుదలకి తీసుకొస్తున్నట్టుగా తేల్చి చెప్పారు.
The post పవర్ఫుల్ టైటిల్ తో విజయ్ ఆంటోనీ 25వ సినిమా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
