పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” ట్రైలర్ తేదీ ఎప్పుడంటే! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో తారక్ చేస్తున్న రెండో సినిమా పైగా ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో అంచనాలు  వేరే లెవల్‌ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా ట్రైలర్ కోసమే అని చెప్పుకొవచ్చు.

తాజాగా ఈ సెప్టెంబర్ 10న ఈ ట్రైలర్ వస్తుంది అని ప్రచారం కూడా జరగగా ఇప్పుడు మేకర్స్ దీన్ని అఫీషియల్ గా ప్రకటించేశారు. తారక్ పై దేవర లుక్ లో ఒక మాస్ అండ్ పవర్ఫుల్ పోస్టర్ ని విడుదల చేసి ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10నే వస్తున్నట్టుగా ప్రకటించేశారు. సో తారక్ అభిమానులు ఈ బిగ్ డే కోసం వెయిట్‌ చేయాల్సిందే.

ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

The post పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” ట్రైలర్ తేదీ ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! | CineChitram

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు గా మార్వలెస్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading