మిల్క్ బ్యూటీ తమన్నా స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను ఎప్పటి నుంచో వెంటాడుతున్న ప్రశ్న. ఈ మధ్యనే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పి పెద్ద షాకే ఇచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరోసారి తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. తమన్నాకు పిల్లలంటే భయం అట.
తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లల గురించి ఎందుకు భయపడుతున్నానో అనే సంగతిని వివరించింది. నేను తల్లి కావడానికి భయపడుతున్నాను. తల్లులు తమ సర్వస్వం తమ పిల్లలకు అందజేస్తారు. నేను పిల్లలకు అంత ప్రేమ, సంరక్షణ – శ్రద్ధ ఇవ్వలేను అని చెప్పుకొచ్చింది. నా తల్లిదండ్రులు నాకు ఎనలేని ప్రేమను ఇచ్చారు.
వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే.. పేరెంటింగ్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్లు అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా నేను చేయలేనని అనుకుంటున్నాను. పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది’’ అని తమన్నా చెప్పుకొచ్చింది. ఈ భయం చూస్తుంటే అసలు తమన్నాకి భవిష్యత్తులో పెళ్లవుతుందా? పిల్లలు పుడతారా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.
The post పిల్లలంటే భయం..అందుకే! first appeared on Andhrawatch.com.