ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది. ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది.
తాజాగా ఈ చిత్రం 50 రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఈ మూవీకి సంబంధించిన OST(ఒరిజినల్ సౌండ్ ట్రాక్)ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి బీజీఎం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.
జనవరి 25న సాయంత్రం 6 గంటలకు ‘పుష్ప 2’ మూవీ OST విడుదల కాబోతుంది. దీంతో ఈ చిత్రంలోని బీజీఎం మరోసారి వినాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు.
The post పుష్ప 2 ఓ ఎస్ టీ వచ్చేస్తుంది! first appeared on Andhrawatch.com.