టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ వర్సెటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయ్ సేతుపతి లాంటి స్టార్‌తో పూరి ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో నటి టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఆమెలాగే డైనమిక్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఆమె పాత్రపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాను పూరి మార్క్ డైలాగ్స్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇక ఈ చిత్రాన్ని పూరి కనెక్స్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, చార్మి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
The post పూరి సినిమాలో టబు! first appeared on Andhrawatch.com.