గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమే “పెద్ది”. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పట్ల మెగా అభిమానుల్లో గట్టి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి అంచనాలు పెంచగా ఇపుడు పెద్ది గ్లింప్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన భార్య ఉపాసనలు ఇచ్చిన ఒక డివోషనల్ సర్ప్రైజ్ ని బుచ్చిబాబు షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ పై పాదుకలు అలాగే మరికొన్ని పుస్తకాలని బహుమతిగా పంపిన పిక్స్ ని షేర్ చేసుకొని బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ పోస్ట్ సహా పిక్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The post ‘పెద్ది’ దర్శకునికి గ్లోబల్ స్టార్ దంపతులు ఏం ఇచ్చారంటే! first appeared on Andhrawatch.com.