బాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ గా సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకొని భారీ వసూళ్లు ఒక్క హిందీ లోనే రాబట్టి సంచలనం రేపింది. టాలెంటెడ్ నటుడు విక్కీ కౌషల్ అలాగే రష్మిక మందన్నా కలయికలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు రిలీజ్ పట్ల కూడా మంచి హైప్ నెలకొంది.
తెలుగు ఆడియెన్స్ డిమాండ్ మేరకు ఇపుడు రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమాపై ఊహించని విధంగా అభ్యంతరం వ్యక్తం అయ్యినట్టుగా తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరులో ఈ చిత్రం తెలుగు రిలీజ్ ని నిలపాలని ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జియా ఉల్ హకీ అక్కడి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించినట్టుగా తెలుస్తుంది.
ఛావా తెలుగులో రిలీజ్ అయితే మాట ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఈ చిత్రం చరిత్రకి సంబంధం లేకుండా 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా ఈ చిత్రంలో చిత్రీకరించారు అని వారు చెబుతున్నారు. దీనితో ఉత్తర భారతంలో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతాయి అని అందుకే ఛావా తెలుగు రిలీజ్ ని ఆపాలని వారు కోరుతూ వినతి పత్రం అందించారు. దీనితో ఈ టాక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఛావా రిలీజ్ విషయంలో అక్కడ ఏం జరుగుతుందో చూడాలి.
The post పెద్ద షాకే! first appeared on Andhrawatch.com.