హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’. కాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సిరీస్‌పై అంచనాలను మరింత పెంచుతుంది.
ఇందులో భాగంగా తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఇక పై మీరు స్పెషల్ సాంగ్స్ చేస్తారా ? అని అడగ్గా.. చెయ్యనని సమంత చెప్పింది.
అలాగే, మీరు సింగిల్ గా ఉండాలని అనుకుంటున్నారా ? అంటే.. ఈ ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ.. ‘లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో, సమంత భవిష్యత్తులో సింగిల్ గా ఉండిపోదు అని, మింగిల్ కావడానికి ఆమె రెడీగా ఉంది అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత కూడా ఓ నటి. ఎన్నో హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ReplyForwardAdd reaction
The post పెళ్లి చేసుకోబోతున్నా! first appeared on Andhrawatch.com.