సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యంగ్ డైరెక్టర్ వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. ఐతే, మరోవైపు త్రిష పెళ్లి పై చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తమిళ మీడియాలో త్రిష పెళ్లికి సంబంధించిన కొత్త రూమర్ వైరల్ అవుతుంది. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలే. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెడిషినల్ ఫొటోను త్రిష షేర్ చేసింది.
కాగా ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ రంగు చీరలో, పైగా ఆ శారీ కలర్ కు మ్యాచింగ్ గా మెడలో నెక్లెస్, చేతికి ఉంగరం ధరించి ఆకట్టుకుంది. పైగా ఈ ఫొటోలకు ‘ ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది’ అని ఓ లవ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. మరి ఈ క్యాప్షన్ తో త్రిష ఏం చెబుతోంది ?, ఒకవేళ తనకు కాబోయే వాడితో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుందా ? అంటూ అభిమానులు డౌట్ పడుతున్నారు. పైగా త్రిష ముఖంలో పెళ్లి కళ కనిపిస్తుందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
The post పెళ్లి పై కొత్త గాసిప్! first appeared on Andhrawatch.com.