పోయిందనుకున్నాను! బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. సింపుల్‌గా ఉన్నా చాలా ఎమోషనల్ గా ఉంటాడు. ఐతే, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘లగాన్’. ఈ సినిమా గురించి ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ ప్రస్తావిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నిజానికి ‘లగాన్’ సమయంలో ఎంతో భయపడ్డాను. ‘నువ్వు ఏ ధైర్యంతో తెరకెక్కిస్తున్నావు ?, ఎందుకు ఇలాంటి సినిమా తీస్తున్నావు ?, ఒక్క రోజు కూడా ఆడదు’ అని సినిమా ఇండస్ట్రీలో చాలామంది నేరుగా నాతోనే అనేవారు. దానికి తగ్గట్టుగానే ఆ సమయంలో క్రికెట్ గురించి గొప్పగా తీసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. అలాంటప్పుడే నేను ‘లగాన్’ తీశాను’ అని అమీర్ ఖాన్ అన్నారు. అమీర్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను లగాన్ ప్లాప్ అవుతుందని నమ్మడానికి మరో కారణం కూడా ఉంది. ఆ రోజుల్లో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఉంది. ‘లగాన్’కు కూడా అమితాబ్ వాయిస్ ఇచ్చారు. దీంతో, కచ్చితంగా లగాన్ కి ఆదరణ లభించదని నేను నమ్మాను. కానీ, నా అంచనాలను తలకిందులు చేసి ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది’’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నేను బాగా నటించాను అనుకున్నాను. కానీ, ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే ఇంకా బాగా చెయ్యొచ్చు ఏమో అనిపిస్తుంది’ అని అమీర్ చెప్పుకొచ్చాడు.
The post పోయిందనుకున్నాను! first appeared on Andhrawatch.com.