ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ మృతి! ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత శ్యామ్ బెనగల్ 90 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
బాలీవుడ్ లో అంకుర్, భూమిక, నిషాంత్ , కల్‌యుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.1934లో డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ , దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి.
The post ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ మృతి! first appeared on Andhrawatch.com.