ప్రమోషన్స్‌ షూరూ చేసిన భైరవం టీం! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తుండటంతో వెండితెరపై వారి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్. తాజాగా ఈటీవీలో రాబోయే ప్రత్యేక ఉగాది ఈవెంట్‌లో ‘భైరవం’ మూవీ యూనిట్ పాల్గొని సందడి చేసింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో ముగ్గురు హీరోలు కూడా ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కెకె.రాధామోహన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ప్రమోషన్స్‌ షూరూ చేసిన భైరవం టీం! first appeared on Andhrawatch.com.

About

Check Also

షూటింగ్‌ లో గాయపడ్డ హృతిక్‌! | CineChitram

షూటింగ్‌ లో గాయపడ్డ హృతిక్‌! ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ బాలీవుడ్ మూవీ ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఏ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading