బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “జాట్” కోసం తెలిసిందే. ఒక హిందీ హీరోని తీసుకొచ్చి ఒక ఊరమాస్ సౌత్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ చూస్తేనే అందరికీ తెలిసిపోయింది. ఇలా ఫైనల్ గా థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ కి రాగా హిందీ జనం నుంచి మెయిన్ గా మాస్ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండడం విశేషం.
ఎన్నో ఏళ్ళు నుంచి మిస్ అవుతున్న మాస్ సన్నీ డియోల్ ని మళ్ళీ జాట్ తో చూశామని ఆడియెన్స్ చెబుతున్నారు. మెయిన్ గా గోపీచంద్ మాస్ టేకింగ్ సంగీత దర్శకుడు థమన్ స్కోర్ తో సినిమా గట్టిగా ఎలివేట్ అయ్యిందని సన్నీ అభిమానులు అంటున్నారు. దీంతో వీరి వర్క్ మాత్రం నార్త్ ఆడియెన్స్ గట్టిగానే కనెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. మరి చూడాలి హిందీలో జాట్ ఏ రేంజ్ వసూళ్లు అందుకుంటుందో అనేది.
The post ఫిదా అయ్యారంతే! first appeared on Andhrawatch.com.