మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వినూత్న సినిమాలను చేస్తూ అందరినీ అలరించడానికి ప్రయత్నిస్తుంటాడు. వరుణ్ తేజ్ హీరోగా తాజాగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “మట్కా” కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్ భారీ బడ్జెట్ తో శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసినట్టుగా సమాచారం.
ప్రస్తుతం మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టారని తెలుస్తుంది. ఈ షూటింగ్ తో సినిమా పూర్తి అయిపోతుంది అని తెలుస్తుంది. ఇందులో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనుండగా మరిన్ని అప్డేట్స్ ప్రేక్షకుల ముందు రానున్నాయి. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.
The post ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న మెగా ప్రిన్స్ మట్కా! first appeared on Andhrawatch.com.