ఫౌజీ పై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌! | CineChitram

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవ్వక ముందే ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని కూడా మొదలు పెట్టేశాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ తన కొత్త సినిమాను తాజాగా ప్రారంభించాడు.

ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా వార్త వినిపిస్తోంది. ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ రీసెంట్‌గా మధురైలో మొదలైంది. అయితే ఈ షూటింగ్‌లో ప్రభాస్ లేకుండానే సీన్స్ తీస్తున్నారు.  ఈ షెడ్యూల్ ఓ వారం రోజుల పాటు సాగనున్నట్లుగా సమాచారం.

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఫౌజీ’లో జాయిన్ అవుతున్నారని టాక్‌ నడుస్తుంది. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా రాబోతుంది.

The post ఫౌజీ పై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishwak Sen’s female look from Laila unveiled | CineChitram

Mass Ka Das Vishwak Sen has garnered a separate fan base in the youth and …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading