బంపరాఫర్‌ కొట్టేసిన శ్రీలీల..ఇక రేంజ్‌ మారిపోయినట్లేనా! | CineChitram

ఒక్క పాట శ్రీలీల జీవితాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమె కెరీర్ ఓ కొత్త ట‌ర్నింగ్ నే తీసుకొచ్చిందా ? అంటే అవునని అంటున్నారు కొందరు. ఇటీవ‌ల విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకున్న  ‘పుష్ప‌-2’ లోని కిసిక్ పాట‌తో పాన్ ఇండియాలో ముద్దుగుమ్మ ఓ వెలుగు వెలుగుతుంది. కిస్ కిస్ కిసిక్ అంటూ కుర్రాళ్ల‌ను నిద్రపోనీయకుండా చేసేసింది. అప్పటి వ‌ర‌కూ హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సారిగా ఐటం డాల్‌ గా  తెర‌పై క‌నిపించే స‌రికి కొత్త ఇమేజ్ క్రియేట్ సొంతం చేసుకుంది. వాస్తవానికి శ్రీలీల మంచి డాన్స‌ర్ కావ‌డంతోనే ఆమెకు ఈ చాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్‌ నడిచింది.

పాట‌లో ఈ ముద్దుగుమ్మ ఎక్స్ ప్రెష‌న్స్, హిప్ మూవ్ మెంట్స్ ప్ర‌తీది యూత్ కు ప‌ర్పెక్ట్ గా క‌నెక్ట్ అయింది. దీంతో శ్రీలీల‌కు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ లో డ్యాన్స్‌ చేసే అవ‌కాశాలే వ‌స్తున్నాయ‌ని వినపడుతుంది. ఈ ముద్దుగుమ్మని ఇప్పటికే రెండు బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ఐటం సాంగ్ కోసం అప్రోచ్ అయిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజ‌మైతే శ్రీలీల కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్నట్లే అని ఇండస్ట్రీ భావిస్తుంది. బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వ‌స్తే హీరోయిన్లే ఐటం భామ‌లు అయిపోతుంటారు. అలాగే ఐటం సాంగ్స్ కంటూ కొంత మంది స్పెష‌లిస్ట్ హీరోయిన్లు కూడా ఉన్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో. మ‌లైకా అరోరా, జాక్వెలిన్ పెర్నాండేజ్, నోరా ప‌తేహీ, మ‌ల్లికా షెరావ‌త్ లాంటి వాళ్లు ఐటం భామ‌లుగా చాలా పాపులర్.. క‌రీనా క‌పూర్, క‌త్రినా కైఫ్ లాంటి వాళ్లు ఐటం పాట‌ల్లో నటించిన సంగతి తెలిసిందే. వాళ్లను కాదని ఐటమ్ సాంగ్స్ మ‌రో హీరోయిన్ కు అదీ తెలుగు హీరోయిన్ కు రావ‌డం అన్న‌ది అంత సుల‌భం కానీ విషయం.

కానీ ఇప్పుడా బోర్డర్ ను శ్రీలీల దాటుతున్నట్లే క‌నిపిస్తుంది. వ‌చ్చిన అవ‌కాశాల్ని వినియోగించుకోగ‌ల్గితే శ్రీలీల మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారినట్లే. మ‌రి ఆ ఛాన్స్ తీసుకుంటుందా? లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

The post బంపరాఫర్‌ కొట్టేసిన శ్రీలీల..ఇక రేంజ్‌ మారిపోయినట్లేనా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …