బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన కృతి శెట్టి! | CineChitram

టాలీవుడ్‌ కి ఉప్పెన సినిమాతో ఒకేసారి కెరటం లా ఎగిసిపడింది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. అదే జోష్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టి కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. కానీ అంతలోనే హ్యాట్రిక్ ఫ్లాప్ వచ్చి చేరాయి. దీని ఫలితంగా గోల్డేన్ లెగ్ అనుకున్న కృతి కాస్త ఐరెన్‌ లెగ్‌గా మారింది. తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో తమిళ్ వైపు అడుగులు వేసింది అమ్మడు. అక్కడ ఏకంగా బాలా-సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా నుంచి సూర్యతో పాటు కృతి కూడా మధ్యలోనే తప్పుకుంది.

ప్రస్తుతం తమిళ్‌లో రెండు మూడు సినిమాలు చేస్తోంది కృతి. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. చివరగా ‘శర్వానంద్’ మనమే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతికి.. ఈ సినిమా కొత్త అవకాశాలు ఏమి తీసుకుని రాలేదు. దీంతో.. ఇక తెలుగులో ఆఫర్లు కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా సమాచారం.  ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు.

ప్రజెంట్ మెకానిక్ రాకీ, లైలా అనే సినిమాలు చేస్తున్నాడు విశ్వక్‌. నెక్స్ట్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలో.. హీరోయిన్‌గా కృతిశెట్టిని ఫైనల్ చేసినట్లుగా  సమాచారం. త్వరలో మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ఏదేమైనా.. తెలుగులో ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న కృతికి.. ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకొవచ్చు.

The post బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన కృతి శెట్టి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …