ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్ ఘటన వల్ల చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన్ని విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.
అయితే, అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకి తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, హైకోర్టులో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణలో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో ఆయనకు విధించిన రిమాండ్ రద్దు అయ్యింది. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు కావడంతో అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
The post బన్నీకి బెయిల్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
