బన్నీ కోసం భారీ ప్రాజెక్టే! | CineChitram

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా కథనాలు బయటకు వినిపించాయి. ‘పుష్ప 2’కి భారీగా బజ్ క్రియేట్‌ అయ్యింది.  పైగా సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ ‘పుష్ప 2’ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు… ఏ దర్శకుడితో చేస్తున్నాడు అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూనే ఉన్నారు.

ఈ మధ్యలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వినిపించిన పేరు అట్లీ. అట్లీ.. అల్లు అర్జున్ కలయిక దాదాపు ఫిక్స్ అని చాలాకాలంగా టాక్‌ నడిచింది. అయితే, ‘పుష్ప 2’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడని సమాచారం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో.., తర్వాత మళ్లీ మరోసారి త్రివిక్రమ్- బన్నీ కాంబో రిపీట్ కాబోతోంది.

పైగా ఈ కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కనీవినీ ఎరుగని భారీ సబ్జెక్ట్ తయారు చేసారట త్రివిక్రమ్. కాగా ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదలు చేయబోతున్నట్లు టాక్.

The post బన్నీ కోసం భారీ ప్రాజెక్టే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …