బన్నీ కోసం హీరోయిన్‌ ని లాక్‌ చేసిన అట్లీ! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్‌ చేశాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడట ఈ స్టార్ హీరో.

తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రాబోతుందని సమాచారం. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ను కూడా అట్లీ ఫైనల్‌ చేశాడు.

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడంట అట్లీ. అటు అందంతో  పాటు అభినయంతో కూడా అభిమానులను ఆకట్టుకునేందుకు ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాడట. ఇక అట్లీ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట.

The post బన్నీ కోసం హీరోయిన్‌ ని లాక్‌ చేసిన అట్లీ! first appeared on Andhrawatch.com.

About

Check Also

రీమేక్ పనిలో దిల్‌ రాజు బిజీ! | CineChitram

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading