ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినపడుతుంది. వచ్చే నెలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ పాల్గొనడు అని.. రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాక.. జూన్ నుంచి బన్నీ షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జోడి కట్టబోతున్నారు. మొత్తానికి తమ నాలుగో సినిమాని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సంగీతం అదించబోతున్నాడు.
The post బన్నీ లేకుండానే..! first appeared on Andhrawatch.com.