బన్నీ విశ్వరూపం పాట వచ్చేసింది! | CineChitram

బన్నీ విశ్వరూపం పాట వచ్చేసింది! తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో మంచి నటన చూపించే అరుదైన హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. మరి తాను ఇన్నేళ్ల కెరీర్ లో పలు సినిమాలకి సెటిల్డ్ అండ్ పర్ఫెక్ట్ నటన కనబరిచి విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే తన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప 1 కి జాతీయ స్థాయి అవార్డు వస్తే పార్ట్ 2 లో అంతకు మించిన నటన కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ లోని నటుడుని ఓ రేంజ్ లో చూపించిన సీక్వెన్స్ లలో జాతర సాంగ్ కూడా ఓ హైలెట్‌ అని చెప్పుకొవచ్చు. డైరెక్టర్‌ సుకుమార్ విజన్ తో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం ఈ పాటకి చూపించాడు అని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ లేదు. అయితే సినిమా థియేటర్స్ లో వచ్చే వరకు కూడా దీనిని ఒక బిగ్ సర్ప్రైజ్ గా దాచి ఉంచారు. అలా దాచి ఉంచిన ఈ సాంగ్ ని అల్లు అర్జున్ తన పెర్ఫామెన్స్ తో ఇంకో లెవెల్ కి తీసుకెళ్లి అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన అందుకునేలా చేసాడు. అయితే ఎట్టకేలకి ఈ సాంగ్ ని మేకర్స్ అధికారికంగా ఫుల్ వీడియో సాంగ్ ని తీసుకోచ్చారు.

The post బన్నీ విశ్వరూపం పాట వచ్చేసింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …