నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘అఖండ 2 – తాండవం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.
తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేయనున్నట్లు సమాచారం.అయితే, ఈ వార్తపై విద్యా బాలన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో విద్యా బాలన్ నటించడం లేదని.. ఆమెకు ‘అఖండ 2’తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో విద్యా బాలన్ అఖండ 2లో నటిస్తుందనే వార్త కేవలం రూమర్ అని తేలిపోయింది.
గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో విద్యా బాలన్ నటించిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించడంతో, ఇప్పుడు అఖండ 2లో ఆమె నటిస్తుందనే వార్త చక్కర్లు కొట్టింది. ఇక అఖండ 2లో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను మే నెలాఖరు వరకు ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
The post బాలయ్య బాబు సినిమాలో ఆ హీరోయిన్ లేదట! first appeared on Andhrawatch.com.