బాలయ్య మెచ్చిన తారక్‌ సినిమా! | CineChitram

ఈ సంక్రాంతి కానుకగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న భారీ సినిమాల్లో  డైరెక్టర్‌  బాబీ అలాగే నటసింహం బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ “డాకు మహారాజ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ బాలయ్య టాక్ షోకి కూడా వచ్చి సందడి చేశారు.

అయితే ఇందులో బాలయ్య కావాలనే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన తీసుకురాలేదు అంటూ పలు కామెంట్లు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారాయి. అయితే అసలు అలాంటివి ఏమి లేదని నిర్మాత నాగవంశీ తో పాటు డైరెక్టర్‌ బాబీ క్లారిటీ ఇచ్చారు. మరి తాజా గా బాబీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తను మాట్లాడుతూ బాలకృష్ణ గారికి తారక్ చేసిన జై లవకుశ సినిమా ఎంతో ఇష్టం అని చెప్పారు.అలాగే ఆరోజున మీరు అనుకున్న డ్రామా ఏమి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. సో ఆ నెగిటివ్ కామెంట్స్ లో నిజం లేదని వివరించారు. ఇక డాకు మహారాజ్ ఈ జనవరి 12 న గ్రాండ్ గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

The post బాలయ్య మెచ్చిన తారక్‌ సినిమా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …