మళ్ళీ బాలీవుడ్ మార్కెట్ మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని భారీ సినిమాలు బి టౌన్ నుంచి వస్తుండగా ఈ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “సింగం అగైన్” కూడా ఒక సినిమా. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమా విషయంలో క్రేజీ బజ్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఈ సినిమా లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే ఒరిజినల్ సింగం సూర్యలు సాలిడ్ క్యామియో రోల్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఇది కానీ నిజం అయితే బి టౌన్ లో రెస్పాన్స్ మాములు లెవెల్లో ఉండదు అని చెప్పుకొవచ్చు.
గతంలో ఓసారి ప్రభాస్ “యాక్షన్ జాక్సన్” అనే సినిమాలో కనిపించి మెరిసిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గా సూర్య “సర్ఫిరా” సినిమాలో క్యామియో ఇచ్చాడు. మరి ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సినిమాలో కనిపిస్తారో లేదో అనేది ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతానికి గట్టి రూమర్సే వినపడుతున్నాయి.
The post బాలీవుడ్ యాక్షన్ సినిమాలో ప్రభాస్-సూర్య! first appeared on Andhrawatch.com.