టాలీవుడ్ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అందాల ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర”. అయితే ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మళ్లీ వింటేజ్ లుక్స్ ని సిద్ధం చేస్తున్నట్లు కనపడుతుంది.
ఇలా ఆ మధ్య వచ్చిన పలు పోస్టర్ లు సహా ఆన్ లొకేషన్ చిత్రాలు కూడా అభిమానులను ఎంతగానో ఊరిస్తున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో క్రేజీ పిక్ వైరల్ అవుతుంది. మెగాస్టార్ పై కంప్లీట్ మాస్ స్వాగ్ తో ఇది కనిపిస్తోంది అని చెప్పాలి. దీంతో ఈ తాజా పిక్ సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మరి మేకర్స్ ఆ డేట్ ని ఎపుడు రివీల్ చేస్తారో చూడాలి.
The post బాస్ మాస్ లుక్! first appeared on Andhrawatch.com.