బుల్లితెర మీద ఎప్పుడంటే! ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేసిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ భారీ హిట్ చిత్రం థియేటర్స్ లో దుళ్లకొట్టేసింది.
అయితే అంతా ఇక ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తుంటే జీ సంస్థ వారు ఈ సినిమా తాలూకా బుల్లితెర టెలికాస్ట్ ను ముందుగా అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. అయితే జీ తెలుగులో అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది అని అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా టెలికాస్ట్ డేట్ ని సెట్ చేసుకుంది. అయితే జీ తెలుగు వారు ఈ చిత్రాన్ని ఈ మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేస్తున్నట్టుగా రివీల్ చేశారు.
మరి బిగ్ స్క్రీన్ పై వండర్స్ సెట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్మాల్ స్క్రీన్ పై కూడా టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డు సెట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
The post బుల్లితెర మీద ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.