బోయపాటి వేట అందుకే! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలయ్య, త్వరలోనే ‘అఖండ 2’ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ‘మహా కుంభమేళ’లో షూటింగ్ జరుపుకున్న ‘అఖండ 2’ను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం బోయపాటి లొకేషన్ల వేటలో పడినట్లు తెలుస్తుంది. ఆయన తాజాగా ఏపీలోని నందిగామ పరిసర ప్రాంతాల్లో బోయపాటి పర్యటించారు.
చందర్లపాడు మండలం గుడిమెట్లలో బోయపాటి శ్రీను కృష్ణానదిపై పడవలో ప్రయాణించి షూటింగ్‌కు అనువైన ప్రదేశాలను పరిశీలించారు.ఇక ఈ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య మరోసారి తన నటవిశ్వరూపం చూపించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
The post బోయపాటి వేట అందుకే! first appeared on Andhrawatch.com.