యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఐకానిక్ డైరెక్టర్ శంకర్ కాంబోలో చేసిన భారీ హిట్ సినిమా “భారతీయుడు” గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “భారతీయుడు 2” మాత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అయినప్పటికీ ఫస్ట్ పార్ట్ మీద ఉన్న గౌరవంతో పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు పెట్టుకొని విడుదలకి వచ్చిన ఈ సినిమా అభిమానులకు భారీ నిరాశనే మిగిల్చింది.అయితే శంకర్ ఏకంగా పార్ట్ 2 చేస్తున్న సమయంలోనే పార్ట్ 3 కూడా పూర్తి చేసేసారు. తీరా సీన్ కట్ చేస్తే పార్ట్ 2 అసలు సోదిలో లేకుండా పోయింది.
కానీ పార్ట్ 2 ప్రమోషన్స్ లో ఆరు నెలల గ్యాప్ లో అయితే పార్ట్ 3 ని విడుదల చేస్తామని తెలిపారు. అలా 2025 జనవరికి పార్ట్ 3 ని లాక్ చేయగా ఇపుడు జనవరి దగ్గరకి రానే వస్తుంది కానీ భారతీయుడు 3 నుంచి సింగిల్ అప్డేట్ కూడా ఒక్క విషయం కూడా బయటకు రాలేదు.
సో వీటితో పార్ట్ 3 ఉన్నట్టా లేనట్టా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. అయితే ఆ మధ్య పార్ట్ 3 డైరెక్ట్ గా ఓటిటిలోనే ఇచ్చేస్తారు అని పలు మాటలు కూడా వినిపించాయి. కనీసం దీనిపై కూడా ఎలాంటి న్యూస్ లేదు. మరి ఎక్కడా విడుదల కాకుండా పార్ట్ 3 మిగిలిపోతుందా లేక వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
The post భారతీయుడు 3 ఉందా! first appeared on Andhrawatch.com.