మంచి ఫేమ్ అందుకున్న యంగ్ హీరో ధర్మ! టాలీవుడ్ లో తమ స్వయం కృషితో మంచి టాలెంట్ ఉంటే పైకి వచ్చిన హీరోలు చాలా మందినే ఉన్నారు. తమదైన నటన, నడవడికతో మెప్పిస్తే చాలు తెలుగు ప్రేక్షకులు తమ ప్రేమను కురిపిస్తారు. ఇలా తన తొలి మూవీ “డ్రింకర్ సాయి”తో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు యువ హీరో ధర్మ. గత డిసెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను పలకరించింది. అయితే ఈ సినిమాలో హీరో ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. సాయి పాత్రలో ధర్మ చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని అందర్ని ఆకర్షిస్తుంది. టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో చాలా మెచ్యూర్డ్ నటన చూపించాడు ధర్మ. మరో ప్రామిసింగ్ యువ హీరో టాలీవుడ్ కు దొరికినట్లే అనే టాక్ “డ్రింకర్ సాయి” విడుదల అయ్యాక ఇండస్ట్రీలో వినపడుతుంది. హీరో ధర్మ స్ట్రాంగ్ కెరీర్ కు “డ్రింకర్ సాయి” మొదటి అడుగు అయ్యింది.
The post మంచి ఫేమ్ అందుకున్న యంగ్ హీరో ధర్మ! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
