మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా అటు తెలంగాణలో ఇటు ఏపీలో కేసులు నమోదు అవుతుండటంతో ఈ వివాదం పై చాలా రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సంక్రాంతి పండుగకు ముందుగానే శ్రీ విద్యానికేతన్ కు చేరుకున్న మోహన్ బాబు, విష్ణు ఫ్యామిలీ సంతోషంగా పండుగ జరుపుకున్నారు.
అయితే, కనుమ రోజు మనోజ్ ఎంట్రీ శ్రీ విద్యానికేతన్ వద్ద హైడ్రామాకు తెర తీసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రగిరి పీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇప్పటికే, మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద జరిగిన ఘటన లపై పోలీసుల దర్యాప్తు కూడా మొదలైంది. ఇరు వర్గాలను విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు.
మరోపక్క ఇప్పటికే ఎక్స్ లోనూ మంచు బ్రదర్స్ ఫైట్ జరిగింది. ఎక్స్ వేదికగానూ అన్నదమ్ముల మధ్య వార్ నడుస్తున్న సమయంలో, కొత్త కేసుల విచారణ క్రమంలో ఈ వివాదం మరింతగా ముదిరిపోయింది. మరి మంచు ఫ్యామిలీ ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాల్సిందే.
The post మంచు కుటుంబ వివాదం ఎటు వైపు! first appeared on Andhrawatch.com.