ప్రముఖ పార్న్ స్టార్ సన్నీ లియోన్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఆమెవెండి తెర మీదకి వచ్చి టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జోనర్లతో అలరించిన సన్నీ ఇపుడు మరో కొత్త కథ విడుదలకు రానుంది. ఈసారి హారర్ సినిమా “మందిర” తో ప్రేక్షకులను భయపెట్టేందుకు రాబోతుంది.
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘మందిర’ చిత్రాన్ని కొమ్మలపాటి శ్రీధర్ ప్రొడక్షన్ లో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించిన సంగతి తెలిసిందే
ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మందిర సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 22న మందిర చిత్రం థియేటర్లోకి రాబోతున్నట్టుగా ఖరారు చేశారు. ఇకపై మందిర టీం ప్రమోషన్స్‌తో సినిమా మీద మరింత హైప్ పెంచేందుకు రెడీఅవుతోంది. ఈ చిత్రానికి జావెద్ రియాజ్ సంగీతం అందించారు. మరి ఈ సినిమాతో సన్నీ ఎలాంటి ట్రీట్ ఇవ్వనుందో చూడాల్సిందే.
The post మందిర ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
