మరోసారి రిపీట్‌ అవుతున్న హిట్‌ కాంబో! | CineChitram

టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న  ప్రెస్టీజియస్ సినిమాల్లో ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఓ మూవీ. ఈ సినిమాను డైరెక్టర్‌ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుల్కర్ తనదైన మార్క్ విజయాన్ని అందుకునేందుకు రెడీ అయిపోతున్నాడు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్‌గా అందాల భామ మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సీతా రామం’ క్లాసిక్ సక్సెస్‌ను అందుకుంది.

దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్ అయితే, మరో క్లాసిక్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో చర్చ నడుస్తుంది. మరి నిజంగానే ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

The post మరోసారి రిపీట్‌ అవుతున్న హిట్‌ కాంబో! first appeared on Andhrawatch.com.

About

Check Also

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! | CineChitram

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు గా మార్వలెస్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading