మరోసారి! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రీసెంట్ హిట్ దేవర సక్సెస్ తర్వాత తన నుంచి మరిన్ని సినిమాలు ఉండగా వాటిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి. ఇక రీసెంట్ గానే ఓ సాలిడ్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో కూడా దేవర తరహా లోనే బీచ్ రిలేటెడ్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఏపీలో ఓ సముద్రపు లొకేషన్ ని పరిశీలించి లాక్ చెయ్యడం కూడా జరిగినట్టు ఇపుడు తెలుస్తోంది. సో మళ్లీ హిస్టరీ రిపీట్ అయ్యేలా ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The post మరోసారి! first appeared on Andhrawatch.com.