మరోసారి..! నాచురల్ స్టార్ నాని హీరోగా ఇపుడు సాలిడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్ 3 అలాగే ది ప్యారడైజ్ చిత్రాలపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండిటి హైప్ లో మరో సాలిడ్ సినిమాని చాలా మంది మర్చిపోయినట్టు ఉన్నారు. అదే యువ దర్శకుడు సుజీత్ తో చేయనున్న గ్యాంగ్ స్టర్ చిత్రం. ఈ సినిమా కూడా అనౌన్సమెంట్ తో మంచి బజ్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విషయంలోనే ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం నిర్మాణ సంస్థ మారనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని మొదట డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు అనౌన్స్ చేశారు కానీ ఈ చిత్రం ఇపుడు నానితో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ సినిమా తీసిన నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ వారికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిజం అయితే మళ్ళీ శ్యామ్ సింగ రాయ్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
The post మరోసారి..! first appeared on Andhrawatch.com.