యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో రెండోసారి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ సెప్టెంబర్ 27న భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు టాక్. మేకర్స్ ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
ఈ మాస్ పోస్టర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేయగా, స్టార్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం ఇచ్చాడు. ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే మరి.
The post మరో పవర్ ఫుల్ పోస్టర్! first appeared on Andhrawatch.com.