నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం తర్వాత రిలీజైన 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా 2 సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.
ఆ విజయాల పై హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిపోదా శనివారం తర్వాత 35 మూవీ పై మా ప్రేక్షకులు ప్రేమను కురిపించడం, ఈ వారం మత్తు వదలరా 2 చిత్రాన్ని పెద్ద విజయం సాధించడం చూసి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని తెలిసిపోయింది.
ఈ అద్భుతమైన టీమ్‌లకు అభినందనలు. ఈ నెలాఖరున ఈ ఉత్సాహాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని నా ప్రియమైన ఎన్టీఆర్, కొరటాల శివ గారిని కోరుకుంటున్నాను అని దేవర చిత్రాన్ని ఉద్దేశించి అన్నారు.
The post మరో స్థాయికి తీసుకుని వెళ్లాలని..! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
