ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు అదిక్ రవిచంద్రన్ కలయికలో తెరకెక్కించిన సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా “గుడ్ బ్యాడ్ అగ్లీ” రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని అక్కడ అందుకున్న సంగతి తెలిసిందే. అజిత్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం దూసుకుపోతుంది.
మరి అజిత్ కి ఒక ఫ్యాన్ బాయ్ గా ఈ యంగ్ దర్శకుడు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇపుడు మళ్ళీ ఇదే కాంబో రిపీట్ అవుతున్నట్టు ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా ఈ సినిమాలోనే ఇందుకు హింట్ ని దర్శకుడు ప్లాన్ చేసి చూపిస్తున్నాడు.
సినిమా క్లైమాక్స్ లో అజిత్ వచ్చే కార్ నెంబర్ ప్లేట్ పై మళ్ళీ తమ కాంబినేషన్ లో సినిమా 2026లో ఉంటుంది అన్నట్టుగా హింట్ ఇచ్చేసారు. దీనితో ఇది పసిగట్టిన అజిత్ ఫ్యాన్స్ ఈ నెక్స్ట్ సినిమా కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మరి అది గుడ్ బ్యాడ్ అగ్లీకి సీక్వెల్ గా ఉంటుందా లేక కొత్త సినిమానా అనేది తెలియాల్సి ఉంది.
The post మళ్లీ అదే కాంబో! first appeared on Andhrawatch.com.