మామూలు రికార్డు బిజినెస్ కాదు ఇది! ఒక సినిమా తాలూకా బిజినెస్ అనేది ఆ సినిమా తాలూకా ప్రమోషనల్ కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు కొన్ని చిత్రాలకి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే మొదలైతే మరికొన్ని చిత్రాలకి అది టీజర్ వరకు వెళుతుంది అని చెప్పవచ్చు. ఇలా లేటెస్ట్ గా టీజర్ తో గట్టి బిజినెస్ ని అందుకున్న చిత్రమే “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”.
నందమూరి టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటి విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ మొన్ననే వచ్చింది. అయితే ఈ టీజర్ సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చినట్టుగా సినీ వర్గాల్లో తెలుస్తుంది. టీజర్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ రామ్ సినిమా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారట.
ఇలా ఆంధ్రలో 12 కోట్లకి పైగా బిజినెస్ చేస్తే సీడెడ్ నుంచే 3.7 కోట్ల బిజినెస్ ఈ చిత్రం చేసిందట. అంతే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా ఈ సినిమాకి అమ్ముడుపోయాయట. ఇలా మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ చిత్రం ఆల్ టైం రికార్డు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా ఈ వేసవి రేస్ లో మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The post మామూలు రికార్డు బిజినెస్ కాదు ఇది! first appeared on Andhrawatch.com.