మామూలు హంగామా కాదుగా! టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గా వచ్చిన టీజర్ తో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాపై ఒక్కసారిగా మరింత హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ దగ్గర లేటెస్ట్ గా విజయ్ అభిమానులు సందడి చేయడం ఇపుడు వైరల్ గా మారింది. మరి సినిమా సెట్స్ దగ్గరకి విజయ్ ఫ్యాన్స్ వెళ్లగా వారికి దర్శకుడు, హీరో ఇచ్చిన వెల్కమ్ తో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా అనిరుద్ క్రేజీ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The post మామూలు హంగామా కాదుగా! first appeared on Andhrawatch.com.