తెలుగు చిత్ర పరిశ్రమ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరోల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా మోస్ట్ అవైటెడ్ మూవీనే “మాస్ జాతర”. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పట్ల మంచి అంచనాలు ఆల్రెడీ నెలకొనగా లేటెస్ట్ గ్లింప్స్ అనౌన్సమెంట్ పై వచ్చిన పోస్టర్ మరింత అంచనాలు పెంచేసింది.
ఇక లేటెస్ట్ గా మాస్ మహారాజ్ పై ఫుల్ ఎనర్జిటిక్ పోలీస్ గెటప్ పోస్టర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చి మేకర్స్ మంచి ట్రీట్ ని ప్రామిస్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ పోస్టర్ తో జనవరి 26 రవితేజ బర్త్ డే కానుకగా ఉదయం 11 గంటల 7 నిమిషాలకి సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. దీంతో మాస్ ట్రీట్ కోసం అంతా రెడీ అవ్వాలని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తుండగా సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The post మాస్ జాతర అదిరిపోయింది! first appeared on Andhrawatch.com.